Sunday, December 22, 2024

గ్రేటర్‌లో ఆర్‌టిసికి పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణ

- Advertisement -
- Advertisement -

Increasing passenger acceptance of RTC in Greater

ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళడంతోనే సాద్యమైంది
ఆర్‌టిసి అధికారులు

హైదరాబాద్: ఆర్‌టిసి ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.ప్రవేట్ ప్రజారవాణ వ్యస్థ అయిన ఆటోలు,క్యాబ్‌లలో ప్రయాణించడం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించడంతో బస్సులు కొంత ఆలస్యమైన వాటిలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రామ్‌గనర్‌లో నివసించే అరుణ్ ఒక ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. తాను ప్రతి రోజు ఎక్కే బస్సు కోసం ఎదురు చూస్తుంటే తోటి ప్రయాణికుడులు ఆర్‌టిసి బస్సులను నమ్ముకుంటే సమయానికి చేరుకోలమేని చెప్పడంతో వెంటనే అరుణ వారించి అది గతంలో ఉన్న పరిస్థితి అని అప్పటికి ఇప్పటికి ఎంతో తేడావచ్చిందని ప్రస్తుతానికి బస్సులు అనుకున్న సమాయానికి వస్తున్నాయని ఒక వేళ జాప్యం జరిగినా 5, లేదా 10 నిమిషాల్లోనే వస్తున్నాయి చెప్పడంతో చేసేది ఏమీ లేక సదరు తోటి ప్రయాణికుడు మౌనంగా ఉండిపోయారు. ఈ ఒక్క సంఘటనే ఆర్‌టిసి పట్ల ప్రయాణికులు ఆసక్త చూపేందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అంతే కాదు ఆర్‌టిసి అధికారులు సైతం ప్రయాణికులు అంచనాల మేరకు పని చేస్తూ సంస్థకు మరింత ఆదరణ తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా బస్టాపుల్లో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నారు. దాంతో బస్సుల రాక పోకలు తెలుసుకునే విధంగా బస్టాపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.బస్టాపుల్లో ఆయా రూట్లలో తిరుగుతున్న బస్సుల, వివరాలు, టైమ్ టేబుల్‌కు సంబంధించి ఫిర్యాదులే అధికంగా రావడంతో అధికారులు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా రూట్ బస్సులు ఏ సమయంలో వస్తాయి. అక్కడ నుంచి అవి ఎప్పుడు వెళ్తాయి అనేక సమాచారం ప్రయాణికులకు తెలిసే విధంగా ప్రేత్యక బోర్డులను ఆర్టిసి అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ప్రయాణికులకు అర్దం అయ్యే విధంగా తెలుగు, హింది, ఇంగ్లీష్ బాషలో బోర్డు రూపొందించి అన్ని బస్టాపుల్లో ఉండేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా బస్టాపుల్లో ప్రత్యేకంగా సూపర్ వైజర్లను నియమించి బస్సులు సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా బస్టాపుల్లోకి వచ్చే బస్సుల సమయాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉన్నతాధికారులకు సంబందిత బస్సుల వివరాలను అందచేస్తుండటంతో వారు తదనగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
నగారానికి ప్రతి రోజు లక్షల్లో ప్రయాణికులు రాక పోకలు సాగిస్తున్నారు.

ముఖ్యంగా ఎంజిబిఎస్, జేబీఎస్‌తో పాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, రైల్వే స్టేషన్ నుంచి రాక పోకలు సాగించే ప్రయాణికులు సంఖ్యను పెంచుకునే దిశగా ఆర్టిసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్టాండ్లు ,రైల్వేస్టేషన్లను కలుపుతూ వెళ్ళే బస్సుల రూట్లను ప్రత్యేకంగా రూపొందించి ఆయా రూట్లలో వెళ్లే బస్సుల రాక పోకల వివరాలను ప్రయాణికులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.ప్రస్తుతం ప్రతి రోజు గేటర్‌లో 2700 బస్సులు 29 డిపోల ద్వారా 30 వేల ట్రిప్పులతో సుమారు 7 లక్షల కిలో మీటర్లు తిరుగూ 25 లక్షలకు పైగా ప్రయాణకులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇదే విధంగా అధికారులు ప్రయాణికుల రవాణా అవసరాలను ఎప్పటికప్పడు తెలుసుకుంటూ ముందుకెళితే త్వరలో గ్రేటర్‌లోని బస్సులు డిపోలు కూడా లాభాలబాట పట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News