Wednesday, January 22, 2025

గిల్, మయాంక్ ఔట్…. ఇండియా ఎ 66/2

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు 15.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా-బి జట్టు 255 పరుగులు ఆధిక్యంలో ఉంది. శుభ్‌మన్ గిల్ 25 పరుగులు చేసి నవదీప్ సైనీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మయాంక్ అగర్వాల్ 36 పరుగులు చేసి నవదీప్ సైనీ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.  ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(0) రియాన్ పరాగ్(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా-బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 321 పరుగులు చేసి ఆలౌటైంది. ఇండియా బి జట్టు నుంచి ముషీర్ ఖాన్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ముషీర్ 373 బంతుల్లో 181 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. నవదీప్ సైనీ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇండియా-ఎ జట్టు బౌలర్లలో ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News