Thursday, November 21, 2024

కష్టాల్లో ఇండియా-ఎ

- Advertisement -
- Advertisement -

పట్టుబిగించిన ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాఎతో జరుగుతున్న రెం డో టెస్టులో ఇండియా ఎ టీమ్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఇప్పటి వరకు ఇండియాకు కేవలం 11 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ మరోసారి నిరాశ పరిచారు. అభిమన్యు 2 ఫోర్లతో 73 పరుగులు చేసి వెనుదిరిగాడు. రాహుల్ 10 పరుగులు మాత్రమే చూసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ కూడా నిరాశ పరిచాడు. సాయి 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దుత్ పడిక్కల్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు.

రుతురా 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇక పడిక్కల్ ఒక పరుగు మాత్రమే చేసి వెబ్‌స్టర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురెల్ (19), నితీష్ రెడ్డి (9) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో వెబ్‌స్టర్, ఆండ్రూలు రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియాఎ తొలి ఇనింగ్స్‌లో 62.1 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మార్కస్ హారిస్ 5 ఫోర్లతో 74 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో మెక్ ఆండ్రూ (26) నాటౌట్, రొచ్చిక్ సియోలి (35), పీర్సన్ (30) మాత్రమే కాస్త రాణించారు. ఇండియా ఎ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు, ముకేశ్ కుమార్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News