Sunday, December 22, 2024

రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా ఎ… ఇండియా బి రెండో ఇన్నింగ్స్ లో 184 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బెంగళూరు చిన్న స్టేడియంలో ఇండియా ఎ-ఇండియా బి మధ్య టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు 7.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా ఎ జట్టు 218 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంది. మయాంక అగర్వాల్ మూడు పరుగులు చేసి యశ్ దయాల్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రియాన్ పరాగ్ 31 పరుగులు చేసి యశ్ దయాల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

ఇండియా బి జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 184 పరుగులు చేసి ఆలౌటైంది. రిషబ్ పంత్ ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఇండియా బి జట్టు బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్(46), నితీశ్ రెడ్డి(19), నవీదీప్ సైనీ(13), యశ్ దయాల్(16), యశస్వి జైశ్వాల్(09), అభిమన్యు ఈశ్వరన్(04), సాయి కిశోర్(0), ముకేశ్ కుమార్(0 నాటౌట్), ముషీర్ ఖాన్(0) పరగులు చేసి ఔటయ్యారు. ఇండియా ఎ బౌలర్లలో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు, అవేశ్ ఖాన్, టానౌష్ కోటియన్ చెరో ఒక వికెట్ తీశారు.

Ind B scored 184 runs in Ind A vs Ind B

ఇండియా బి తొలి ఇన్నింగ్స్: 321
ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్: 231
ఇండియా బి సెకండ్ ఇన్నింగ్స్: 184

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News