- Advertisement -
మొహాలి: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ అదరగొట్టారు. టాస్ గెలిచిన బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్థీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టార్ బ్యాట్స్ మెన్స్ రోహిత్(11), కోహ్లీ(2)లు విఫలమైనా.. ఓపెనర్ కెఎల్ రాహుల్(55), సూర్యకుమార్ యాదవ్(46), హార్దిక్ పాండ్యా(71)లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో భారత్, ఆసిస్ ముందు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
IND set target 209 runs against AUS in 1st 20
- Advertisement -