Sunday, December 22, 2024

బంగ్లాపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వికెట్ కీపర్ సంజూ శాం సన్ (29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), హార్దిక్ పాండ్యా (39) రాణించారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ శాంటో (27), మెహిడీ హసన్ మిరాజ్ (35) మాత్రమే రా ణించడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అర్ష్‌దీప్‌సింగ్ అందుకున్నాడు. ఇదిలాఉంటే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 10 తేడాతో ముందంజలో ఉంది. ఇరుజట్ల మధ్య ఈ నెల 9న ఢిల్లీ వేదికగా రెండో టీ20మ్యాచ్ జరగనుంది.

నిప్పులు చెరిగిన మయాంక్
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మయాంక్ యాద వ్.. తనపై టీమిండియా మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గంటకు 149 కిలోమీటర్ల వేగం తో నిలకడగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.మెయిడిన్ ఓవర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించా డు. పవర్ ప్లేలో చివరి ఓవర్‌కు బంతిని అందుకున్న మ యాంక్ యాదవ్.. గంటకు 141.8, 145.7, 137.9, 147.3, 135.1, 148 కిలోమీటర్ల వేగంతో ఆరు బంతుల ను మెయిడిన్ వేశాడు. అతని వేగవంతమైన బంతులను బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ టచ్ చేయలేకపోయా డు. దాంతో మయాంక్ యాదవ్ కంటే ముందు అజిత్ అగార్కర్ సౌతాఫ్రికాతో), అర్ష్‌దీప్‌సింగ్ (2022లో ఇంగ్లండ్‌తో) మెయిడిన్ ఓవర్‌తో కెరీర్లను ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News