Saturday, January 4, 2025

చివరి టెస్టుకు జురెల్

- Advertisement -
- Advertisement -

పంత్ స్థానంలో యువ వికెట్‌కీపర్‌కు చోటు?
సిడ్నీ: ప్రతిష్టాత్మక బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్ట్ జనవరి రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో స్థానం దక్కించుకోవాలంటే టీమిండియా ఐదో టెస్టులో తూచ తప్పక గెలవాలి. అందుకే ఐదో టెస్ట్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. దీంతో జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్‌ను ఈ టెస్టు నుంచి తప్పించాలనే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంత్ స్థానంలో ధృవ్ జురెల్‌ను ఆడించనున్నట్లు సమాచారం.

కాగా, ఈ యువ వికెట్ కీపర్ ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఎతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతం చేశాడు. మెల్‌బోర్న్ పిచ్‌పై రెండు ఇన్నింగ్స్‌లో భారీ అర్ధ శతకాలు సాధించాడు. అనంతరం ముంబైతో జరిగిన ఇరానీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 93 పరుగులతో జురెల్ ఆకట్టుకున్నాడు. అయితే పెర్త్ వేదిక జరిగిన తొలి టెస్టులో జురెల్ 11, 1 పరులే చేశాడు. దీంతో ఆతరువాత జరిగిన మూడు టెస్టులకు అతన్ని పక్కన పెట్టి, పంత్ జట్టుతోకి తీసుకుంది.

అయితే నాలుగు టెస్టుల్లో పంత్.. 37, 1, 21, 28, 9, 28, 30 పరుగలు చేశాడు. 22.0 సగటుతో 154 పరుగులు మాత్రమే చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పడేసుకుంటున్నాడు. దీంతో గుర్రుగా ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్ పంత్ స్థానంలో జురెల్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News