Friday, November 8, 2024

కుర్రాళ్లకు సవాల్

- Advertisement -
- Advertisement -

నేడు సౌతాఫ్రికాతో తొలి టి20

డర్బన్: సౌతాఫ్రికాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా మొదటి టి20 జరుగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు సంజు శాంసన్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సంజు ఆశించిన విధంగా సక్సెస్ కావడం లేదు. కనీసం ఈ సిరీస్‌లోనైనా అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిసోంది. మరోవైపు ఐడెన్ మార్‌క్రమ్ సారథ్యంలోని సౌతాఫ్రికా కూడా సిరీస్‌పై కన్నేసింది. టి20 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి పోరు ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది.

భారీ ఆశలతో భారత్..

సిరీస్‌లో టీమిండియా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఇటీవల సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో పూర్తిగా భిన్నమైన జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం ఈ సిరీస్‌లోనైనా మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలువాలని భావిస్తోంది. భారత్ ఈసారి పూర్తిగా యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. టి20 స్పెషలిస్ట్, భారత సారథి సూర్యకుమార్‌పై అందరి దృష్టి నిలిచింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. టి20లలో సూర్యకు కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇక సౌతాఫ్రికాపై అతని రికార్డు మరింత అద్భుతంగా ఉంది. ఇలాంటి స్థితిలో జట్టు అతనిపైనే భారీ ఆశలు పెట్టుకుంది. సంజు శాంసన్ రూపంలో మరో పదునైన అస్త్రం భారత్ వద్ద ఉండనే ఉంది. శాంసన్ కూడా తన పాత్రకు న్యాయం చేయాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా శాంసన్‌కు ఉంది. ఇక అభిషేక్ శర్మ రూపంలో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రింకు సింగ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, విజయ్‌కుమార్ వైశాక్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో భారత్ సిరీస్‌లో ఎలాగైన విజయం సాధించాలని తహతహలాడుతోంది.

ఫేవరెట్‌గా సఫారీ టీమ్..

మరోవైపు ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ కూడా సిరీస్‌పై కన్నేసింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ మార్‌క్రమ్ జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. రిజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కొ జాన్సన్ వంటి టి20 స్పెషలిస్ట్‌లు జట్టులో ఉన్నారు. కొయెట్టి, కేశవ్ మహారాజ్, పీటర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. సొంత గడ్డపై ఆడుతుండడం సౌతాఫ్రికాకు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News