Saturday, December 28, 2024

నేడే టీమిండియా-అఫ్గాన్ టీ20 మ్యాచ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు వేదికగా మరి కాసేపట్లో ఇండియా-అఫ్ఘాన్ టీ20 మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లూ గెలిచి సీరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు మూడో మ్యాచ్ లాంఛనప్రాయమే. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టినట్టు అవుతుంది. ఇప్పటివరకూ ఎక్కువ వైట్ వాష్ లు చేసిన రికార్డు ఇండియా, పాకిస్తాన్ ల పేరిట ఉంది. ఈ రెండు జట్లూ చెరో 8 క్లీన్ స్వీప్ లూ చేసి అగ్రస్థానంలో ఉన్నాయి. అఫ్ఘాన్ పై టీమిండియా గెలిస్తే, 9 క్లీన్ స్వీప్ లతో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో అందరి కళ్లూ కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్ లలోనూ డకౌట్ అయిన రోహిత్, మూడో మ్యాచ్ లో పెద్ద స్కోరు సాధిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను జియో సినిమా యాప్, వెబ్ సైట్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడుతున్న చివరి సీరీస్ ఇదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News