- Advertisement -
మొహాలి: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆథిత్య జట్టు టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తలపడుతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకుని భారత్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడడం లేదు. తర్వాతి మ్యాచ్ ను నుంచి బుమ్రా జట్టుతో కలువనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆసీస్ డాషింగ్ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. అయితే, స్టార్ ఓపెనర్ వార్నర్‌కు విశ్రాంతినివ్వగా.. పేసర్లు స్టార్క్, స్టొయినిస్, మార్ష్ లకు గాయాలయ్యాయి. దీంతో కీలక ఆటగాళ్లు లేకుండానే టీమిండియాతో తలపడుతున్న ఆసీస్ గట్టి పోటీ ఇస్తుందో లేదో చూడాలి.
IND vs AUS 1st T20: Aus won toss and opt bowl
- Advertisement -