కోహ్లీని మూడో ఓపెనర్‌గా పేర్కొన్న కెప్టెన్ రోహిత్
టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్‌పై హిట్‌మ్యాన్ స్పష్టత
రేపటి నుంచి ఆసీస్‌తో భారత్ టీ20 సిరీస్
షమీ స్థానంలో ఉమేశ్
న్యూఢిల్లీ: సారథ్యంలోని టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో తలపడనుంది. సిరీస్‌లోని తొలి టీ20 మంగళవారం మొహాలీ వేదికగా జరగనుంది. ఈనేపథ్యంలో ఆసియాకప్‌లో చేసిన ప్రయోగాలనే టీమిండియా చేయనుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసి యా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారతజట్టు కనీసం ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. వచ్చేనెలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆతిథ్య భారత్ పర్యాటక ఆసీస్‌ను ఎలా కట్టడి చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. టీమిండియా రేసుగుర్రం బుమ్రా, గాయాలనుంచి కోలుకోవడం భారత్‌కు కలిసొచ్చే ఈనేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో కోహ్లీ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. మనకు తగినన్ని అవకాశాలు ఉండటం మంచిదే. ప్రపంచకప్‌లో రాణించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కొత్తగా ఏదైనా ప్రయత్నించినపుడు దాన్ని మనం ఓ సమస్యగా భావించకూడదని రోహిత్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల సామర్థాన్ని మనం అర్ధంచేసుకోవాలి. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. కోహ్లీ ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి అద్భుతంగా రాణించాడు. కోహ్లీ మా ఓపెనర్. తను కూడా ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఆసియాకప్‌లో చివరిమ్యాచ్‌లో కోహ్లీ మెరిశాడు. అయితే ప్రపంచకప్‌లో కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా బ్యాటింగ్ ఆరంభిస్తాడు. కొన్నిసార్లు విఫలమైనా ఆ స్థానంపై ఎక్కువగా ప్రయోగాలు చేపట్టాలని భావించడం లేదని తెలిపాడు. రాహుల్ భారతజట్టులో ప్రధానమైన ఆటగాడు. ప్రపంచకప్‌లో భారత్ ఓపెనర్‌గా రాహుల్ బరిలోకి దిగుతాడని రోహిత్ ఆదివారం స్పష్టతనిచ్చాడు. కొవిడ్ కారణంగా జట్టుకు దూరమైన స్థానంలో ఉమేశ్‌యాదవ్ జట్టులో చేరతాడని కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించాడు. అవేశ్‌ఖాన్ ఆసియాకప్‌లో అస్వస్థతకు గురయ్యాడు. కోలుకుని ఫిట్‌నెస్ సాధించడానికి కొంతసమయం పడుతుంది. ఉమేశ్ వేగంగా బౌలింగ్ చేయడంతోపాటు బంతిని స్వింగ్ చేయగలుగుతున్నాడని కెప్టెన్ రోహిత్ తెలిపాడు.
నెట్స్‌లో చెమటోడ్చిన సూర్య, కోహ్లీ..
కంగారూలతో మూడు మ్యాచ్‌ల సిరీస్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు ఆదివారం ప్రాక్టీస్ ప్రారంభించింది. రేపటి నుంచి పంజాబ్‌లోని మొహాలీ వేదికగా సిరీస్ ప్రారంభం కానుంది. ఈక్రమంలో సూర్యకుమార్ యాదవ్, విరాట్‌కోహ్లీ నెట్స్‌లో చెమటోడ్చారు. నెట్‌సెషన్స్‌లో క్లాసీ అలరించారు. కోహ్లీ, సూర్యకుమార్ ఒకరి తరువాత ఒకరు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ దీనికి సంబంధించిన వీడియోను అభిమానులకు షేర్ చేసింది. కాగా మూడు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుండగా రెండో మ్యాచ్ నాగ్‌పూర్, మూడో మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది.
ఆసీస్‌తో తలపడే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్‌పటేల్, భువనేశ్వర్‌కుమార్, హర్షల్‌పటేల్, దీపక్ చాహర్, బుమ్రా, యాదవ్.
IND vs AUS 1st T20 Match Today at Mohali