Sunday, January 19, 2025

జడేజా, అశ్విన్ మాయాజాలం.. కంగారూలు కుదేలు

- Advertisement -
- Advertisement -

జడేజా, అశ్విన్ మాయాజాలం.. కంగారూలు కుదేలు
తొలి టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం
రెండో ఇన్నింగ్స్‌లో 91పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
ఇన్నింగ్స్ 132పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రవీంద్ర జడేజా
నాగ్‌పూర్: బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై భారతజట్టు ఇన్నింగ్స్ 132పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన రోహిత్‌సేన 79పరుగులు జోడించి ఆలౌటైంది. ఈక్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 223పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో హడలెత్తించాడు. కీలక ఐదు వికెట్లను పడగొట్టి ఆసీస్ వెన్నువిరిచాడు. భారత ధాటికి కుదేలైన ఆసీస్ 91పరుగులకే కుప్పకూలింది. దీంతో భారతజట్టు ఇన్నింగ్స్ తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. కాగా రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 3వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5వికెట్లు పడగొడితే రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌లో 5వికెట్లు రెండో ఇన్నింగ్స్‌లో 2వికెట్లు తీశాడు. అక్షర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి టెస్టులో అశ్విన్, అక్షర్, జడేజాతో కూడిన స్పిన్ దళం 16వికెట్లు పడగొట్టింది.

అక్షర్, షమీ మెరుపులు
మూడో రోజు 321పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో అక్షర్‌పటేల్, రవీంద్ర జడేజా జోడీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలబెట్టిన ఈ జోడీని స్పిన్నర్ మర్ఫీ విడదీశాడు. 185బంతుల్లో 9ఫోర్లుతో, 70పరుగులు చేసిన జడేజాను మర్ఫీ బౌల్డ్ చేశాడు. దీంతో 328పరుగుల వద్ద టీమిండియా వికెట్ పడింది. బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాట్‌ను ఝుళిపించిం పరుగుల వర్షం కురిపించాడు. 47బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37పరుగులు చేసి బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి 380 పరుగుల వద్ద భారత్ 9వ వికెట్‌పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా వెరవకుండా సెంచరీ దిశగా అక్షర్ పటేల్‌ను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ అడ్డుకున్నాడు. 174బంతుల్లో 10ఫోర్లు, ఓ సిక్స్‌తో 84పరుగులు చేసిన అక్షర్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 400పరుగుల వద్ద ముగిసింది. సిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.

ఆసీస్‌ను హడలెత్తించిన అశ్విన్
తొలి ఇన్నింగ్స్‌లో స్వల్పస్కోరుకే చాప చుట్టేసిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బేజారెత్తింది. అశ్విన్ స్పిన్ మాయాజాలానికి కుప్పకూలింది. ప్రధానంగా టీమిండియా స్పిన్ దళం ధాటికి ఆసీస్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ వార్నర్ వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకుని పర్యాటక జట్టును దెబ్బతీశాడు. ఖవాజా అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటవగా, (10)ను అశ్విన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించి రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కీలక లబుషేన్ (17)ను జడేజా తనవంతుగా ముందు దొరకబుచ్చుకుని ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు.

ఈ దశలో అశ్విన్ విజృంభించడంతో ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెన్షా (2), హ్యాండ్స్‌కోంబ్ (6), వికెట్ కీపర్ కేరీ (10) అశ్విన్ పెవిలియన్‌కు పంపగా కెప్టెన్ కమిన్స్ (1) జడేజా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా భరత్ చేతికి చిక్కాడు. టీమిండియాలో గుబులు రేపిన అరంగేట్ర బౌలరు మర్ఫీ (2)ని అక్షర్ ఔట్ చేశాడు. లియోన్ (8), బోలాండ్ (౦)లకు షమీ పెవిలియన్ బాట చూపాడు. మొత్తంమీద 32.3ఓవర్లలో ఆస్ట్రేలియా 91పరుగులకు ఆలౌటవగా ్టవ్ స్మిత్ (25) నాటౌట్‌గా నిలిచాడు.

ముచ్చటగా మూడోసారి…
టీమిండియా ఆసీస్‌పై ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయం సాధించడం ఇది మూడోసారి. కోల్‌కతా వేదికగా 1997/98లో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు ఆస్ట్రేలియాపై 219పరుగులు తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత వేదికగా 2012/13లో ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 135పరుగుల తేడాతో గెలిచింది. దాదాపు దశాబ్దం తరువాత తాజాగా నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News