Wednesday, January 8, 2025

ఆత్మవిశ్వాసం పెంచే విజయమిది

- Advertisement -
- Advertisement -

టీమిండియాలో సరికొత్త జోష్

పెర్త్: వరుస ఓటములతో డీలా పడ్డ టీమిండియాలో పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం కొత్త జోష్ నింపిందని చె ప్పాలి. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 03 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఇ లాంటి స్థితిలో బలమైన ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్ ట్రోఫీ టీమిండియాకు సవాల్‌గా మారింది. ఆ త్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయిన భారత్‌కు ఆసీస్ సిరీస్‌లో మరిన్ని చేదు అనుభవాలు తప్పక పోవచ్చని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. దీనికి తోడు పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. అద్భుత ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయం వల్ల మొదటి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.

దీంతో పాటు వ్యక్తిగత కారణా ల వల్ల రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు కష్టాలు ఖాయమని మా జీ క్రికెటర్లు, విశ్లేషకులు జోస్యం చెప్పారు. కానీ కెప్టెన్ జస్‌ప్రిత్ బు మ్రా జట్టును నడిపించిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే కుప్పకూలినా బుమ్రా ధైర్యం కోల్పోలేదు. సహచరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి జట్టును ముందుండి నడిపించాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పతనాన్ని శాసించాడు. బుమ్రా అంచనాలకు మించి రాణించడంతో బలమైన ఆస్ట్రేలియా టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. కీలకమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

యశస్వి, రాహుల్ జోరు..

బౌలర్లు అందించిన స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్‌ను భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్‌లు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించా రు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లలను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ప్రతికూల వాతావరణంలోనూ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన యువ ఓపెనర్ యశస్వి ఈసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అంచనాలకు మించి రాణించి జట్టును సురక్షిత స్థితికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ కూడా సమన్వయంతో ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.

రానున్న టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడేందుకు యశస్వి, రాహుల్‌లకు ఈ ఇన్నింగ్స్ దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా ఈ మ్యాచ్‌లో తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. జట్టు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెడుతూ కీలక సమయంలో అద్భుత శతకాన్ని శాసించాడు. ఈ అజేయ సెంచరీ కోహ్లి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పాలి. మిగిలిన మ్యాచుల్లో మరింత ఉత్సాహంతో ఆడేందుకు ఇది దోహదం చేయడం ఖాయం.

సమష్టిగా ముందుకు..

తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించిందంటే దానికి సమష్టి పోరాటమే కారణమని చెప్పాలి. బ్యా టర్లు, బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించారు. దీంతో ఏ మా త్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా చిరస్మరణీ య విజయాన్ని తన ఖాతాలో వేసింది.

కెప్టెన్ బుమ్రా, సిరాజ్, హర్షి త్, వాషింగ్టన్, నితీశ్ రెడ్డి తదితరులు అద్భుత బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. యశస్వి,రాహుల్, రిషబ్, నితీశ్, కోహ్లి తదితరులతో బ్యాట్‌తో మెరిశారు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌ను నాలుగు రోజుల్లోనే సొంతం చేసుకుని ఆస్ట్రేలియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మిగిలిన టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం సహకరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News