Wednesday, January 22, 2025

సిరీస్‌పై టీమిండియా కన్ను.. నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే

- Advertisement -
- Advertisement -

ఇండోర్: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా కనిపిస్తోంది. తొలి వన్డేలో జరిగిన పొరపాట్లకు ఈసారి తావులేకుండా చూసి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇటు భారత్, అటు ఆస్ట్రేలియా సమతూకంగానే ఉన్నాయి. అయితే మొదటి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. బౌలింగ్‌లో షమి అసాధారణ ప్రతిభను కనబరిచాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు బుమ్రా, అశ్విన్, జడేజా తదితరులతో భారత బౌలింగ్ బలంగా ఉంది.

ఇక తొలి వన్డేలో విఫలమైన శార్దూల్‌ను ఈ మ్యాచ్‌లో పక్కన బెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు మొహాలీలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించారు. టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.
సవాల్ వంటిదే..
మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు బాగానే రాణించారు. అయితే బౌలర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం సత్తా చాటేందుకు కంగారూలు సిద్ధమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News