Saturday, November 23, 2024

ఆస్ట్రేలియాతో రెండో టీ20.. పిచ్, వెదర్ ఎలా ఉందంటే?

- Advertisement -
- Advertisement -

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు(ఆదివారం, నవంబర్ 26) భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా తిరువనంతపురంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా 25శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక, పిచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ కంటే బౌలింగ్ కే ఎక్కుగా అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో జరిగిన గత మూడు మ్యాచ్ లోనూ లో స్కోరింగే నమోదైంది. మరి ఇలాంటి వికెట్ పై భారత యువ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

కాగా, విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్ తో చెలరేగగా.. ఇషాన్ కిషన్, రింకూ సింగ్ లు రాణించారు. తొలి మ్యాచ్ లో గెలిచి జోరు మీదున్న యంగ్ ఇండియా ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News