Saturday, November 16, 2024

హోరాహోరీ ఖాయం.. నేడు ఆస్ట్రేలియాతో రెండో టెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తొలి టెస్టులో విజయంతో జోరుమీదున్నటీమిండియా అదే జోరుతో రెండో టెస్టులోనూ సయితం గెలుపొందాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పటికే రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత్‌లో అడుగుపెట్టింది ఆసీస్ జట్టు. తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికీ గెలుపే లక్షంగా ఆత్మవిశ్వాసంతో రెండో టెస్టుకు సన్నద్ధమైంది.

భారత స్పిన్ దళాన్ని ఎదుర్కొనేందుకు నెట్స్‌లో స్పిన్ బౌలింగ్‌ను విపరీతంగా ప్రాక్టీస్ చేశారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. భారత దేశవాళీ స్పిన్నర్లతో సాధన చేశారు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి నుంచి ఎలాగైనా బయటపడేందకు ఢిల్లీ టెస్టుకు సిద్ధమయింది. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ రెండో టెస్టులో ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ ఆధిక్యాన్ని సాధిస్తుందా లేదా ఇందులో విజయంతో ఆసీస్ సిరీస్‌ను సమం చేస్తుందానేది వేచి చూడాలి.

జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, షమీ, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్ షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, లియాన్, బోలాండ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News