Monday, December 16, 2024

 రెండో టెస్టుపై ఉత్కంఠ.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ మైదానంలో టెస్ట్ క్రికెట్ తిరిగి వచ్చింది. దీనికి ముందు 2017లో అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భారత జట్టు భావిస్తుండగా ఈ టెస్టులో ఎలాగైనా గెలుపొంది సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.

దీంతో ఢిల్లీ టెస్టుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. ఈ గ్రౌండ్ కెపాసిటీ దాదాపు 40 వేల మంది ప్రేక్షకులు ఉండగా, ఇందులో దాదాపు 24000 టిక్కెట్లు అభిమానులకు అందించారు. నిబంధనల ప్రకారం 8000 టిక్కెట్లను డిడిసిఎ అధికారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ఈనెల 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది, ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని డిడిసిఎ జాయింట్ సెక్రటరీ రాజన్ మంచాంద ప్రకటించాడు.

పుజారాను ఊరిస్తున్న మైలురాయి..
టీమిండియా నయావాల్ ఛటేశ్వర్ పుజారా మరో మైలురాయిరి చేరువలో ఉన్నాడు. టెస్టు కేరీర్‌లో ఎన్నో రికార్డులూ ఖతాలో వేసుకున్న పుజారా 13 ఏళ్ల నుంచి భారత టెస్టు జట్టులో ప్రధాన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ప్రతి క్రికెటర్ కలలు కనే 100వ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. కెరీర్‌లో చాలా కొద్ది మందికే దక్కే ఈ అరుదైన అవకాశం పుజారాకు లభించనుంది. ఈ రెండో ద్వారా ఈ ఘనత సాధించనున్న 13వ ఇండియన్ క్రికెటర్‌గా పుజారా నిలవనున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న టీమ్‌లో విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్‌గా పుజారా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. విరాట్ గతేడాది మార్చిలో శ్రీలంకతో తన వందో టెస్టు ఆడాడు. పుజారా తన కెరీర్లో భారీగా పరుగులు సాధించిన ఆస్ట్రేలియాపైనే ఇప్పుడీ అరుదైన ఘనతను సాధించడం ఎంతో విశేషం.

IND vs AUS 2nd Test Match on Feb 17

ఇక 2010లో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన టెస్టులోనే పుజారా అరంగేట్రం చేశా డు. తన తొలి మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్‌ను కాదని పుజారాను మూడోస్థానంలో పంపగా.. అతడు 72 రన్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్ గెలిచిన ఇండియా సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాపై అతడు 21 టెస్టులు ఆడి. 52.77 సగటుతో 1900 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. కాగా, 100వ టెస్టు ఆడుతున్న పుజారాకు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్టును షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News