- Advertisement -
అడిలైడ్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ 66 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 214 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మార్నస్ లబుషింగే, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 34 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్నష్ లబుషింగే 64 పరుగులు చేసి నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ తొమ్మిది పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పంత్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(63), అలెక్స్ కారే(05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 180
- Advertisement -