మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు బోర్డర్‌గవాస్కర్ సిరీస్ తొలి టె స్టు మ్యాచ్‌లో లభించిన విజయం ఆత్మవిశ్వాసాన్ని రెట్టిం పు చేసిందనే చెప్పాలి. తీవ్ర ఒత్తిడిలో తొలి టెస్టు బరిలోకి దిగిన భారత్ అసాధారణ ఆటతో ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు భారత్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊ హించి ఉండరు. కానీ, టీమిండియా మాత్రం సమష్టి ప్రతిభతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో జయకేతనం ఎగుర వేసింది.
రానున్న నాలుగు టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కివీస్ చేతిలో వరుస ఓటములతో డీలా పడ్డ భారత జట్టులో పెర్త్ టెస్టు విజయం కొత్త జోష్ నింపిందని చెప్పాలి. ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయిన భారత్‌కు ఆసీస్ సిరీస్‌లో మరిన్ని చేదు అనుభవాలు తప్పక పోవచ్చని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో భారత్‌కు కష్టాలు ఖాయమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు జోస్యం చెప్పారు. కానీ కెప్టెన్ జస్‌ప్రిత్ బుమ్రా జట్టును నడిపించిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే కుప్పకూలినా బుమ్రా ధైర్యం కోల్పోలేదు.
సహచరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి జట్టును ముందుండి నడిపించాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పతనాన్ని శాసించాడు. ఇక శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టులో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టులో చేరనున్నారు. దీంతో డేనైట్ పద్ధతిలో జరుగనున్న రెండో టెస్టులో భారత్ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత పటిష్ఠస్థితికి చేరాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
భారీ ఆశలతో బరిలోకి..
అడిలైడ్ టెస్టుకు టీమిండియా భారీ ఆశలతో సిద్ధమైంది. తొలి టెస్టు విజయం జట్టులో కొత్త జోష్‌ను నింపింది. ఇదే జోరును అడిలైన్‌లోనూ కొనసాగించాలనే లక్షంతో ఉం ది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెల్ రాహుల్‌లు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లోనూ రాహుల్‌ను ఓపెనర్‌గా దించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ఓపెనర్‌గా ది గిన రాహుల్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడు. అయితే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్, యశస్విలు మె రుగైన ఆరంభాన్ని అందించారు. భారత్ విజయంలో వీరి భాగస్వామ్యం చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో రెండో టెస్టులోనూ వీరినే ఓపెనర్లుగా దించినా ఆశ్యర్యం లేదు.
తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియ న్ చేరిన యువ ఓపెనర్ యశస్వి ఈసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అంచనాలకు మించి రాణించి జట్టును సురక్షిత స్థితికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ కూడా సమన్వయంతో ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. ఇక పేలవమైన ఫామ్‌తో సతమతమవుతు న్న సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా ఈ మ్యాచ్ లో తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. జట్టు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెడుతూ కీలక సమయంలో అద్భుత శతకాన్ని శాసించాడు.
ఈ అజేయ సెంచరీ కోహ్లి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పాలి. మిగిలిన మ్యాచు ల్లో మరింత ఉత్సాహంతో ఆడేందుకు ఇది దోహదం చే యడం ఖాయం. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భా రీ తేడాతో రికార్డు విజయం సాధించిందంటే దానికి సమ ష్టి పోరాటమే కారణమని చెప్పాలి. బ్యాటర్లు, బౌలర్లు త మ పాత్రను సమర్థంగా పోషించారు. దీంతో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండో టె స్టులోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే లక్షం తో భారత్ కనిపిస్తోంది.