Sunday, December 22, 2024

చివరి వన్డేలో భారత్‌పై ఆసీస్ విజయం..

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: భారత్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 352 పరుగులు చేసింది.

ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (54), మిఛెల్ మార్ష్ (96) జట్టుకు శుభారంభం అందించారు. స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72)లు కూడా అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లి (56), శ్రేయస్ (48), జడేజా (35), రాహుల్ (26) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News