Friday, November 22, 2024

మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. ఆస్ట్రేలియాదే సిరీస్

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 17 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 2 ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ వెంటనే శుభ్‌మన్ గిల్ (37) కూడా వెనుదిరిగాడు. తర్వాత ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను విరాట్ కోహ్లి, రాహుల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. రాహుల్ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (2), సూర్యకుమార్ (0)లు నిరాశ పరిచారు. కొద్ది సేపటికే విరాట్ కోహ్లి (54) కూడా ఔటయ్యాడు.

మరోవైపు హార్దిక్ పాండ్య (40), జడేజా (18)లు రాణించినా ఫలితం లేకుండా పోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు, అష్టన్ అగర్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిఛెల్ మార్ష్ (47), ట్రావిస్ హెడ్ (33) శుభారంభం అందించారు. మిగతావారిలో వికెట్ కీపర్ కారే (38), అబాట్ (26), లబుషేన్ (28) పరుగులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News