Sunday, December 22, 2024

మూడో వన్డే: రోహిత్, కోహ్లీ బ్యాక్.. బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఈరోజు జరుగుతున్న చివరి మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగుతోంది. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్ లు తిరిగి జట్టులోకి రాగా.. గిల్, శార్దుల్ ఠాకూర్, షమీలకు విశ్రాంతినిచ్చారు.

ఇప్పటివరకు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా, ఈ మ్యాచ్ లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ భావిస్తోంది. కాగా, ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లను గెలిచి సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News