Monday, December 23, 2024

మూడో టీ20 మ్యాచ్ లో అతనే ఆసీస్ కు బ్రహ్మాస్త్రం

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య మూడో టి20 మ్యాచ్ మంగళవారం గౌహతిలో జరగబోతోంది. టీమిండియా చేతిలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆస్ట్రేలియాకు ఇది చావో రేవో తేల్చుకునే మ్యాచ్. దీంతో తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనున్నది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియాపై సెంచరీ చేసి, జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ట్రావిస్ హెడ్ ను బరిలోకి దింపబోతోంది.

IND vs AUS 3rd T20 : Will Travis Head get to Chance?

మొదటి రెండు మ్యాచ్ లకూ అతనికి రెస్ట్ ఇచ్చారు. మంగళవారం జరగనున్న మూడో మ్యాచ్ కీలకం కావడంతో హెడ్ ను తుది జాబితాలో చేర్చారు. హెడ్ ఓపెనర్ గా వస్తే  షార్ట్ పెవిలియన్ కు పరిమితం కావలసి ఉంటుంది.టీమిండియాలో అందరూ నిలకడగా రాణిస్తున్నారు. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలో మూడో మ్యాచ్ కూడా గెలిచి, సీరీస్ కైవసం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News