Thursday, January 16, 2025

గబ్బా టెస్టుకు వర్షం ఆటంకం.. రెండు సెషన్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ కు వరుణుడు అడ్డుపుడుతున్నాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆసీస్ జట్టు స్కోరు 28/0 వద్ద వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఆ తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో రెండు సెషన్స్ ఆట పూర్తిగా రద్దైంది. ప్రస్తుతం స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో తొలి రోజు ఆట రద్దు అయ్యే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:

భారత్‌: యశస్వీ జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌రెడ్డి, జస్ప్రిత్‌ బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌.

ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ మెక్‌స్వీనీ, లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ గ్యారీ, కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయాన్‌, హేజిల్‌వుడ్‌.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News