Sunday, January 19, 2025

నాలుగో టీ20కి ఆసీస్ స్టార్ ఆటగాళ్లు దూరం..

- Advertisement -
- Advertisement -

ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈరోజు(శుక్రవారం) భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. రాయ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. గౌహతి వేదికగా జరిగిన మూడో టి20లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా సమరోత్సాహంతో నాలుగో మ్యాచ్ కు సిద్ధమైంది.

అయితే కిందటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. మ్యాక్స్‌వెల్‌తో పాటు స్మిత్, స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ తదితరులు స్వదేశం వెళ్లిపోయారు. వీరి స్థానంలో కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఇలాంటి స్థితిలో భారత్‌ను ఓడించాలంటే ఆస్ట్రేలియా సర్వం ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News