Monday, December 23, 2024

టీ20లో రుతురాజ్ గైక్వాడ్ రికార్డు..

- Advertisement -
- Advertisement -

టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 4వేల పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రుతురాజ్ నిలిచాడు. శుక్రవారం ఆసీస జట్టుతో జరిగిన నాలుగో టీ20లో 32 పరుగులు చేయడం ద్వారా రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. 116 ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ ఈ రికార్డు సాధించాడు. ఇండియా తరుఫున కేఎల్ రాహుల్ 117 ఇన్నింగ్స్‌లలో 4వేల పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, ఇంటర్నేషన్ టీ20లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 4వేల పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్లలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ కేవలం 107 ఇన్నింగ్స్‌లలోనే 4వేల పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టి20లో ఆతిథ్య టీమిండియా 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News