Wednesday, January 1, 2025

ముగిసిన నాలుగో రోజు ఆట.. ఆస్ట్రేలియా 228/9

- Advertisement -
- Advertisement -

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది.ఆదివారం ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ కు 333 పరుగుల ఆధిక్యం లభించింది. 173 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. చివరి వికెట్ నాథన్ లియోన్(41), బోలాండ్(10)లు కలిసి 55 పరుగుల కీలక భాగస్వామన్ని నమోదు చేశారు.

లాస్ట్ వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా, వారిద్దరూ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ.. టీమిండియా బౌలర్లను విసిగించారు. సమయం కంటే అర్ధగంట ఎక్కువసేపు మ్యాచ్ ను కొనసాగించిన భారత బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. ఇక, టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు. ఇక, రేపు చివరి రోజు జరిగే మ్యాచ్ ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News