Monday, April 28, 2025

నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి..

- Advertisement -
- Advertisement -

బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 155 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(9), రాహుల్(0), విరాట్ కోహ్లీ(5)లు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు.

ఇక, జడేజా(2), నితీశ్ కుమార్ రెడ్డి(1) కూడా ఈ సారి విఫలమయ్యారు. జైస్వాల్(84), పంత్(30) తప్ప ఎవరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగులతో భారత్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News