Monday, January 27, 2025

బాక్సింగ్ టెస్టు: చేతులెత్తేసిన భారత బౌలర్లు.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు కాన్‌స్టాస్‌, ఖవాజాలు అర్థ శతకాలతో మెరిశారు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన కాన్ స్టాస్ 65 బంతుల్లోనే 6 పోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌(26)తో కలిసి మరో వికెట్ కోల్పోకుండా ఖవాజా(52) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 42 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా ఒక వికెట్ తీశాడు.

ఇరుజట్ల వివరాలు:

భారత్‌: జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌.

ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖవాజా, సామ్‌ కాన్‌స్టాస్‌, లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌మార్ష్‌, అలెక్స్‌ కేరీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌, స్కాట్‌ బొలాండ్‌.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News