- Advertisement -
మెల్‌బోర్న్ వేదికగా భారత్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి రోజు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్స్ లో కాన్‌స్టాస్(60), ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72), స్టీవ్ స్మిత్(68)లు అర్థశతకాలతో చెలరేగారు. దీంతో తొలిరోజు భారత్ పై ఆసీస్ పై చేయి సాధించింది. ఇక, భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. జడేజా, సుందర్, ఆకాశ్ దీప్ లు తలో వికెట్ తీశారు.
- Advertisement -