Thursday, January 23, 2025

విశాఖ వన్డే టికెట్ల విక్రయం..

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విశాఖపట్నం వేదికగా జరిగే రెండో వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 19న విశాఖపట్నంలోని ఎసిఎవిడిసిఎ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో రెండో వన్డే నిర్వహిస్తున్నారు.

ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా.. మార్చి 10 నుంచి ఆన్‌లైన్‌లో 13 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించనున్నారు. ఆఫ్‌లైన్‌లో ఈసారి మూడు కేంద్రాల్లో టికెట్లను విక్రయిస్తారు. ఎక్కడ అమ్ముతారనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. ఇక ఆన్‌లైన్ టికెట్లను పెటిఎంలో అందుబాటులో పెట్టనున్నారు. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.6000గా టికెట్ల ధరలను నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News