Thursday, September 19, 2024

టీమిండియా కఠోర సాధన

- Advertisement -
- Advertisement -

నెట్స్‌లో చెమటోడుస్తున్న ఆటగాళ్లు

చెన్నై : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈనెల 19 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దాంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నారు. ఇటు బౌలర్లు అటు బ్యాటర్లు చమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బిసిసిఐ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో సాగుతున్న ఈ ప్రాక్టీస్‌లో సిరాజ్, కుల్దీప్, ఆకాశ్‌దీప్, బుమ్రా, యశ్ దయాల్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ధృవ్ జురెల్, రోహిత్, విరాట్ కోహ్లి, అశ్విన్, జడేజా, యశస్వి, గిల్ సాధన చేస్తూ కనిపించారు. వారికి గంభీర్ సలహాలు, సూచనలు ఇస్తూ దర్శనమిచ్చాడు.

ఇక టీమిండియా సారథి రోహిత్ శర్మ టీమ్ సభ్యులతో ప్రత్యర్థి ఆటగాళ్లను ఎలా నిలువరించాలి? బంగ్లాపై గేమ్ ప్లాన్ వంటి అంశాలపై వ్యూహాలు రచిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు వారం రోజుల ముందుగానే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. బంగ్లాతో సిరీస్‌ను టీమిండియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఘోరంగా ఓడించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోదలచుకోలేదు. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ తమదైన రోజున అద్భుతాలు చేయగలదు. వీటిని కట్టడి చేయడమే టీమిండియాకు ముందున్న సవాల్ అని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News