Monday, December 23, 2024

జోరుగా.. హుషారుగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో ఘన విజయం సాధించడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇందు కోసం భారత జట్టు కఠోర సాధన చేస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇక గాయంతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కెఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇక సోమవారం భారత జట్టు ముమ్మర సాధనలో నిమగ్నమైంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రాక్టీస్ సెషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు.

ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ వారికి తగు సలహాలు, సూచనలు ఇస్తు సందడి చేశాడు. ఇదిలావుండగా సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిసోంది. మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాపై అందరి దృష్టి నెలకొంది. అతను ఈసారి ఎలా ఆడతాడో అంతుబట్టకుండా పోయింది. ఇక విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ తదితరులు ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరటనిచ్చే అంశమే. ఇక రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు తొలి టెస్టులో చోటు కల్పించారు.

ఇక టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో వెటరన్ ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్‌కు చోటు కల్పించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సిరాజ్, ఉమేశ్, సైనీ, శార్దూల్, అశ్విన్, కుల్దీప్, అక్షర్‌లతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కూడా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో సిరీస్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News