Thursday, November 14, 2024

సత్తా చాటిన బౌలర్లు..

- Advertisement -
- Advertisement -

సత్తా చాటిన బౌలర్లు.. ఉమేశ్, అశ్విన్ మ్యాజిక్
బంగ్లాదేశ్ 227 ఆలౌట్, భారత్ 19/0
ఢాకా: బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన రెండో, చివరి టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే పరిమితం చేయడంలో భారత్ సఫలమైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టి తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (14), రాహుల్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో కేవలం 227 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

బంగ్లా జట్టులోమోమినుల్ హక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మోమినుల్ హక్ 12 ఫోర్లు, సిక్సర్‌తో 84 పరుగులు చేశాడు. మిగతా వారిలో ముష్ఫికుర్ రహీం (26), లటన్ దాస్ (25), ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ (24) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 25 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌కు కూడా నాలుగు వికెట్లు లభించాయి. సుదీర్ఘ విరామం తిరిగి టెస్టు మ్యాచ్ ఆడిన వెటరన్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ రెండు వికెట్లు తీశాడు. ఇదిలావుంటే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News