Monday, December 23, 2024

కష్టాల్లో టీమిండియా.. ఆశలన్నీ పంత్ పైనే..

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌ జట్లుతో జరుగుతున్న చివరి రెండో టెస్టు మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్(02), శుభమన్ గిల్(07), చటేశ్వర పుజారా(06), విరాట్ కోహ్లీ(01)లు ఒకరి వెంట ఒకరు క్రీజులోకి వచ్చినట్లే వచ్చి వెనుదిరిగారు. దీంతో టీమిండియా కేవలం 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(26), ఉనద్కట్(03)లు ఆడుతున్నారు.

భారత్ గెలవాలంటే ఇంకా 100 పరుగులు కావాలి. కాగా, టాప్ అర్డర్ బ్యాట్స్ మన్స్ పెవిలియన్ చేరడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ గెలిస్తే 2-0తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంటోంది.ఒకవేళ, నాలుగో రోజు బంగ్లా బౌలర్లు విజృంభిస్తే మాత్రం టీమిండియాకు ఓటమి తప్పదు. ఇలా జరుగుతే.. సిరీస్ ను 1-1తో బంగ్లా సమం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News