Wednesday, January 22, 2025

బోణీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో భారత్..
భారీ ఆశలతో ఇంగ్లండ్
నేడు కోల్‌కతాలో తొలి టి20

షమి రాకతో..
మరోవైపు గాయంతో చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి సిరీస్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతని రాకతో జట్టు బౌలింగ్ మరింత మెరుగ్గా మారింది. షమి సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్, సుందర్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తదితరులతో భాతర బౌలింగ్ చాలా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా సిరీస్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

కోల్‌కతా: భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మొదటి మ్యాచ్‌కు రెండు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. సొంత గడ్డపై ఆడుతుండడంతో ఆతిథ్య భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇంగ్లండ్‌కు పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌లోనూ విధ్వంసక ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ జోస్ బట్లర్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

అందరి కళ్లు శాంసన్‌పైనే..

సిరీస్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌పైనే నిలిచాయి. టి20లలో వరుస సెంచరీలతో అదరగొడుతున్న శాంసన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. యువ సంచలనం అభిషేక్ శర్మతో కలిసి జట్టుకు మెరుపు ఆరంభం అందించాలనే లక్షంతో సంజు పోరుకు సిద్ధమయ్యాడు. అభిషేక్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలని తహతహలాడుతున్నాడు. ఇక కెప్టె న్ సూర్యకుమార్ రూపంలో టీమిండియాకు వి ధ్వంసకర బ్యాటర్ ఉన్నాడు. టి20లలో సూర్య కు కళ్లు చెదిరే రికార్డు ఉంది.

ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హైదరాబాదీ తిలక్‌వర్మ కూడా జోరుమీదున్నాడు. గతంలో జరిగిన టి20 సిరీస్‌లలో తిలక్‌వర్మ వరుస సెంచరీలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్‌లోని ఇద్దరు రాణిస్తే భారత్‌కు భారీ స్కోరు ఖాయం. ఇక రింకు సింగ్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. టి20లలో రింకుకు అద్భుత రికార్డు ఉంది. మరోవైపు నితీష్ కుమార్ రెడి, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వంటి ప్రతిభావంతులైన ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది.

తక్కువ అంచనా వేయలేం..

ఇక ఇంగ్లండ్‌ను కూడా తక్కువ వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. జోస్ బట్లర్, లివింగ్ స్టోన్, ఫిలిప్ సాల్ట్, హారీ బ్రూక్, బెన్ డకెట్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, మార్క్‌వుడ్, రషీద్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌కు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News