Thursday, January 23, 2025

ఆత్మవిశ్వాసంతో భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs ENG 1st ODI Match Today

ఆత్మవిశ్వాసంతో భారత్
మరో సిరీస్‌పై కన్ను, నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే
లండన్: ఇప్పటికే టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. వన్డేల్లోనూ గెలిచి సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. మరోవైపు టి20లో ఎదురైన పరాజయానికి వన్డేల్లో గెలిచి బదులు తీర్చుకోవాలనే లక్షంతో ఇంగ్లండ్ సిరీస్‌కు సిద్ధమైంది. ఇక బెన్ స్టోక్స్, రూట్, లివింగ్‌స్టోన్, బెయిర్‌స్టో తదితరుల చేరికతో ఇంగ్లండ్ మరింత బలోపేతంగా మారింది. టీమిండియాలో కూడా శిఖర్ ధావన్, షమి, సిరాజ్, శార్దూల్ తదితరులు జట్టులోకి చేరారు. దీంతో భారత్ కూడా మరింత పటిష్టంగా తయారైంది. అయితే చివరి టి20లో ఓటమి పాలుకావడం టీమిండియాకు కాస్త ప్రతికూల పరిణామంగా చెప్పాలి. టి20లతో పోల్చితే ఇంగ్లండ్ వన్డేల్లో చాలా బలమైన జట్టుగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్‌ను ఓడించాలంటే భారత్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి. కానీ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్ జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఏకైక టెస్టుతో పాటు మూడు టి20ల్లోనూ కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ కూడా వరుస వైఫల్యాలు చవిచూశాడు. అయితే వన్డే సిరీస్ చెలరేగాలనే పట్టుదలతో వీరున్నారు. ఇక రెండు జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లు ఉండడంతో ఈ సిరీస్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం.

IND vs ENG 1st ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News