- Advertisement -
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(76), శుభ్ మన్ గిల్(14) పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 127 పరుగుల వెనకంజలో ఉంది.
ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ బెన్ స్టోక్స్ (70) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. బెయిర్ స్టో 37 పరుగులు, డకెట్ 35 పరుగులు, జోరూట్ 29 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
- Advertisement -