Monday, January 20, 2025

భారీ శతకంతో చెలరేగిన పోప్.. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 316/6

- Advertisement -
- Advertisement -

ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా స్కోరు దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 77 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది.

ఓపెనర్లు బెన్ డకెట్ (47), జాక్ క్రాలే(31)లు దూకుడుగా ఆడి వికెట్లను చేరజార్చుకోగా.. ఓలీ పోప్ భారీ శతకంతో చెలరేగాడు. పోప్ తోపాటు బెన్ ఫోక్స్ కూడా రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు, భారత్ పై 126 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం క్రీజులో పోప్(148 నాటౌట్), రెహాన్ అహ్మద్(16 నాటౌట్)లు ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. జడేజా, అక్షర్ పటేల్ లు తలో ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News