Sunday, January 19, 2025

సందడే.. సందడి: భారత్‌-ఇంగ్లండ్‌కు టెస్టుకు బ్రహ్మరథం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. అన్ని రోజులు కూడా ఉప్పల్ స్టేడియంలో అభిమానులతో కిటకిటలాడింది.

ప్రతిరోజు ఐదు వేల మంది విద్యార్థులకు మ్యాచ్‌లో ఉచిత ప్రవేశం కల్పించారు. అంతేగాక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆర్మీ, నేవి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉచిత ప్రవేశం కల్పించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు స్వయంగా స్టేడియంలో తిరుగుతూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు.

ఆర్మీ కుటుంబ సభ్యులతో పాటు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్న విద్యార్థులు, అభిమానులతో కలిసి జగన్‌మోహన్ రావు మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉప్పల్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. హెచ్‌సిఎ అధికారులు ముందు చూపుతో తీసుకున్న విప్లవాత్మక మార్పుల వల్ల టెస్టు మ్యాచ్ అంచనాలకు మించి విజయవంతమైందనే చెప్పాలి.

తొలి రోజూ నుంచే స్టేడియం అభిమానులతో కిటకిటలాడుతోంది. మ్యాచ్‌ను తిలకించేందుకు జంటనగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో స్టేడియంతో పాటు పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఆదివారం నాలుగో రోజు కూడా మ్యాచ్‌ను తలికించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News