నాటింగ్‌హామ్: తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ కెఎల్ రాహుల్(26) జట్టు స్కోరు 34 పరగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(12)తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ(12) మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించాడు. దీంతో భారత్ ప్రస్తుతం వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఐదో రోజు కేవలం 157 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జో రూట్(109) సెంచరీతో మెరవడంతో ఇంగ్లండ్ జట్టు 303 పరుగులకు ఆలౌటైంది. ఇక, బెయిర్‌స్టో(30), శామ్ కరన్(32), లారెన్స్(25), డొమినిక్ సిబ్లీ(28)ల సహకారంతో జో రూట్ ఇంగ్లండ్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఇక, భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు 95 పరుగుల భారీ ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే.
IND vs ENG 1st Test: KL Rahul dismissed for 26