Monday, January 20, 2025

పోప్ సెంచరీ.. ఇంగ్లాండ్ ఆధిక్యం 58 పరుగులు

- Advertisement -
- Advertisement -

ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్ మెన్ ఓలీ పోప్ సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 436 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ పై టీమిండియా 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు పటిష్ట స్థితిలో కొనసాగతోంది. ఓపెనర్లు బెన్ డకెట్ (47), జాక్ క్రాలే(31)లు దూకుడుగా ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఓలీ పోప్.. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 62 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. క్రీజులో పోప్(102), బెన్ ఫోక్స్(31)లు ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 58 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News