Sunday, December 29, 2024

జడేజా అర్థ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోర్ 358 దగ్గర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రన్ ఔట్ అయ్యాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా అర్థ శతకాన్ని నమోదు చేశాడు.

ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు ప్రారంభించిన భారత్ కీలక వికెట్లు చేజార్చుకుంది. కెెఎల్ రాహుల్(86), యశస్వి జైస్వాల్ (80)లు అర్థశతకాలతో సాధించారు. శ్రీకర్ భరత్(41) పర్వాలేదనిపించినా.. శ్రేయస్ అయ్యర్(35), రోహిత్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(23)లు నిరాశపర్చారు. ప్రస్తుతం టీమిండియా 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(62), అక్షర్ పటేల్(04)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News