Monday, December 23, 2024

ఓపెనర్ డకెట్ ఔట్.. ఇంగ్లండ్ 67/1

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టపోయి 67 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన రెహాన్ అహ్మద్ తో కలసి మరో ఓపెనర్ జాక్ క్రాలీ ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను తలకెత్తుకున్నాడు. క్రాలీ 29 పరుగులతోనూ, అహ్మద్ తొమ్మిది పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 332 పరుగులు చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News