Monday, December 23, 2024

టీమిండియా 255 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 396 పరుగులు చేయగా ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ గెలవాలంటే రెండో ఇన్నింగ్స్ లో 399 పరుగులు చేయాల్సి ఉంటుంది.

తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండో ఇన్నింగ్ లో స్వల్ప స్కోరు(17)కే అవుటయ్యాడు. గత 11 ఇన్నింగ్స్ లో వరుసగా విఫలమవుతున్న మరో యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ మాత్రం రెండో ఇన్నింగ్ లో నిలదొక్కుకుని సెంచరీ సాధించాడు. మూడో రోజు ఆటలో అక్సర్ పటేల్ ఒక్కటే కాస్త చెప్పుకోదగిన స్కోరు(45) చేశాడు. చివర్లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేశ్ కుమార్ పరుగులేమీ చేయకుండా వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో 255 పరుగులకే ఇండియా రెండో ఇన్నింగ్స్ ముగిసిపోయింది.

ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్ లీకి నాలుగు, రెహాన్ అహ్మద్ కు మూడు వికెట్లు దక్కగా, జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News