Wednesday, February 12, 2025

క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

పరువు కోసం ఇంగ్లండ్.. నేడు చివరి వన్డే

అహ్మదాబాద్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆతిథ్య టీమిండియా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో, చివరి వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉం ది. ఇక ఇంగ్లండ్ కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోం ది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆఖరి వన్డేలోనూ గెలిచి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సమరోత్సాహంతో సిద్ధం కావాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ భారత్ సమతూకంగా ఉంది. విరాట్ కోహ్లి తప్ప మిగతా బ్యాటర్లందరూ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పాలి.

రోహిత్ జోరు సాగాలి..

కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అద్భుత సెం చరీతో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కిందటి మ్యాచ్‌లో రోహిత్ కళ్లు చెదిరే సెంచరీ సాధించాడు. చివరి వన్డేలోనూ సత్తా చా టాలనే పట్టుదలతో ఉన్నాడు. రోహిత్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చె ప్పాలి. ఈసారి కూడా శుభ్‌మన్‌తో కలిసి ఇన్నిం గ్స్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. కటక్‌లో రోహిత్, గిల్‌లు మెరుగైన బ్యాటింగ్‌తో అలరించారు. అహ్మదాబాద్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నారు.

విరాట్ గాడిలో పడాల్సిందే..

మరోవైపు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆడిన ఏకైక మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. కొంతకాలంగా కోహ్లి వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. కివీస్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో పేలవమైన ఫామ్‌తో సతమతమయ్యాడు. తాజాగా కటక్ వన్డేలోనూ తేలిపోయాడు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో కోహ్లి గాడిలో పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ ఫామ్‌ను అందుకున్నాడు. కోహ్లి కూడా టచ్‌లోకి వస్తే రానున్న ఛాంపియన్స్

ట్రోఫీలో టీమిండియాకు ఎదురే ఉండదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్‌కు మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. తొలి రెండు వన్డేల్లో రాహుల్ విఫలమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్‌లు జోరుమీదున్నారు. తొలి రెండు వన్డేల్లో ఇద్దరు మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. జడేజా, అక్షర్, హర్షిత్, అర్ష్‌దీప్, షమి, వరుణ్, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.

సవాల్ వంటిదే..

ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ కనీసం ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించాలనే లక్షంతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయిన పరువును దక్కించుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగానే ఉన్నా ఇంగ్లండ్‌కు వరుస పరాజయాలు తప్పలేదు. కీలక ఆటగాళ్లు ఫామ్ కోసం తంటాలు పడుతున్నారు. చివరి వన్డేలోనైనా సమష్టిగా రాణించి విజయం సాధించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇందులో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News