Monday, December 23, 2024

సమరోత్సాహంతో ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

IND vs ENG 3rd ODI Match Today

సమరోత్సాహంతో ఇంగ్లండ్
సిరీసే లక్షంగా భారత్, నేడు చివరి వన్డే
మాంచెస్టర్: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు ఆతిథ్య ఇంగ్లండ్ సమరోత్సాహంతో సిద్ధమైంది. రెండో వన్డేలో టీమిండియాను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు లార్డ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే లక్షం టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. రెండు జట్లు కూడా సిరీస్‌పై కన్నేయడంతో ఆదివారం ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో జరిగే చివరి వన్డే హోరాహోరీగా సాగడం ఖాయం. ఇక ఇప్పటికే టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం భారత్‌కు ప్రతికూలంగా మారింది. రెండో వన్డేలో 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా టీమిండియా విఫలమైంది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 146 పరుగులకే కుప్పకూలింది. రీస్ టొప్లే అసాధారణ బౌలింగ్‌తో భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి భారత్‌కు ప్రమాదం పొంచివుంది.

లార్డ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు విఫలమయ్యారు. అంతేగాక వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి కూడా నిరాశ పరిచాడు. కోహ్లి వరుస వైఫల్యాలు టీమిండియాను వెంటాడుతున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడు. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఇక టి20 సిరీస్‌లో కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఇక రెండో వన్డేలో కూడా 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కిందటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ కూడా సున్నాకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యకుమార్, హార్దిక్, జడేజా తదితరులు మెరుగ్గా రాణిస్తేనే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తీరుతాయి. లేకుంటే మరోసారి ఇబ్బందులు ఖాయం.
ఆత్మవిశ్వాసం రెట్టింపు..
మరోవైపు లార్డ్‌లో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. రెండో వన్డేలో 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం ఇంగ్లండ్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. ఈ గెలుపు జట్టులో కొత్త జోష్‌ను నింపింది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ కనిపిస్తోంంది. ఓపెనర్లు బెయిర్‌స్టో, రాయ్, కెప్టెన్ బట్లర్, రూట్, లివింగ్‌స్టోన్, స్టోక్స్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక టొప్లే, స్టోక్స్, విల్లీ, కార్స్, ఓవర్టన్, మోయిన్ అలీలతో బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IND vs ENG 3rd ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News