Thursday, January 30, 2025

అతడే మా కొంప ముంచాడు: సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడో టి20లో టీమిండియా ఓటమి చవి చూడడంతో హ్యాట్రిక్‌కు బ్రేక్ పడింది. మూడో టి20లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసి 15 పరుగులు ఇచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ స్పందించారు. రషిద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఇంగ్లాండ్ గెలిచిందని సూర్యకుమార్ తెలిపాడు. తిలక్ వర్మను అదిల్ ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయిందన్నారు.

అతడు కనీసం స్ట్రైక్ రొటేట్ చేయనీయలేదని, ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడని ప్రశంసించారు. మ్యాచ్‌కు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించామని, కానీ అలా జరగలేదన్నారు. హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నప్పుడు టీమిండియా చేతిలోనే మ్యాచ్ ఉందన్నారు. జట్టులోకి ఎక్కువ మంది స్పిన్నర్లు అందుకే తీసుకున్నామని, బౌలింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బాగుందన్నారు. బ్యాటింగ్‌లో ఇంకా తాము మెరుగుపడాలని, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని సూర్యకుమార్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News