Thursday, January 23, 2025

సూర్యాకుమార్ శతకం వృథా.. ఇంగ్లండ్ విజయం

- Advertisement -
- Advertisement -

IND vs ENG 3rd T20: England Win by 17 Runs

మూడో టి20లో ఇంగ్లండ్ విజయం
సూర్యాకుమార్ శతకం వృథా
17 పరుగుల తేడాతో భారత్ ఓటమి
నాటింగ్‌హమ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టి20లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యాకుమార్ 117(55 బంతులు: 14×4 6×6) శతకంతో పోరాడినా మిగితా వారెవరూ రాణిం చకపోవడంతో 17 వరుగుల తేడాతో రోహిత్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ బ్యా టర్లు మలన్, విలింగ్‌స్టోన్ అద్భుతమైన బ్యాటిం గ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వారి ధాటికి భారత్ భారీ మూల్యం చెల్లించుకో క తప్పలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్ 27(26 బం తులు: 1×4 2×6), బట్లర్ 18(9 బంతులు: 2×4 1×6)లు త్వరగానే అవుటైనా ఆ తరువాత క్రీజలోకి వచ్చిన డేవిడ్ మలన్ 77(39 బంతులు : 6×4 5×6) బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. మలన్‌కు తోడు లియాన్ లివింగ్‌స్టోన్ 42(29 బంతులు: 4×6) సైతం విజృంభించడంతో ఇం గ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. వీరిరువురు కలిసి సిక్సర్ల మోత మోగించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసుకున్నారు.

IND vs ENG 3rd T20: England Win by 17 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News