Sunday, December 22, 2024

తొలి రోజు అదరగొట్టిన టీమిండియా.. రోహిత్, జడేజా సెంచరీలు

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు టీమిండియా బ్యాట్స్ మెన్లు అదరగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110)లు సూపర్ సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడుగా సర్ఫరాజ్ ఖాన్(62) కూడా మెరుపులు మెరించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 86 ఓవర్లలో 326 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించి భారత్ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10)తోపాటు రజత్ పాటీదర్(05), శుభమన్ గిల్(0)లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరడంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రవీంద్ర జడేజాతో కలిసి మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు.

ఈ క్రమంలో రోహిత్.. టెస్టుల్లో 11వ శతకాన్ని పూర్తి చేశాడు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(62 పరుగులు, 66 బంతుల్లో) అర్థ సెంచరీతో చెలరేగాడు. అనంతరం జడేజా కూడా శతకం బాదాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం క్రీజులో జడేజా(110), కుల్దీప్ యాదవ్(01)లు ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ హుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News